72 మేళకర్త రాగాలు

155౦వ సంవత్సరంలో శ్రీ రామామాత్యుల వారు మేళకర్తలను మొట్ట మొదటిగా “స్వర మేళ కళా నిధి” అనే పవిత్ర సంగీత శాస్త్ర గ్రంధంలో పొందుపరిచారు ఆతరువాత శ్రీయుతులు వే౦కటమఖి మరియు గోవిందాచారి మేళ కర్తరాగాలకు రూపు రేఖలను ఏర్పరచి సంపూర్ణ రాగాలుగా వాటిని స్థిరీకరించారు.ఈ ముగ్గురిని “స్వర త్రయం” గా మనం గుర్తుంచుకొని గౌరవించుకోవటం మన ధర్మం .

ఈనాడు స్వరవీణాపాణి ఆ మహా సరస్వతి దివ్యానుగ్రహంతో సూక్ష్మీకరించిన 72 మేళకర్తరాగాల స్వర కల్పనను సాహిత్యంతో సహా అందించారు. ఇది ఒక అపూర్వ రాగయాగం, అమోఘమైన నూతన ఆవిష్కరణం....21 వ శతాబ్ధిలోనే సంగీత రంగంలో మహా విప్లవం. సంగీత ప్రియులందరికీ, ,సంగీత విద్యార్ధినీవిద్యార్ధులందరికీ సంతోషకరం. ఈ సంగీత యజ్ఞం పేరు స్వరనిధి’ కావడం యాదృచ్ఛికం.. దైవ సంకల్పం.

భారతీయ సంగీత ప్రాభవ వైభవాలకు మహా దర్పణం ఈ “స్వరనిధి” ప్రయోగం. “ స్వరనిధి” - ప్రపంచ సంగీతానికి పెద్ద బాలశిక్ష .ప్రపంచంలోని అన్ని సంగీతాల సూక్ష్మ రూపం ..72 మేళకర్త రాగాల ఈ కల్పనం. రాప్, పాప్, రాక్, జాజ్, డిస్కో, గజల్, భజన్, ఏ రూపమైనా అన్నింటికి భూమిక ఇది. అన్ని జన్య రాగాలకు ఆధారము ఈ 72 మేళకర్త రాగాలే.. ఇవే జనక రాగాలు.

మేళ కర్త రాగములు
శుద్ధ మధ్యమ రాగములు ప్రతి మధ్యమ రాగములు
క్ర.సం రాగము స్వర స్థానము క్ర.సం రాగము స్వర స్థానము
1. ఇందు చక్రము 7. ఋషి చక్రము
1
 • కనకాంగి
S R1 G1 M1 P
D1 N1 S’
37
 • సాలగం
S R1 G1 M2 P
D1 N1 S’
2
 • రత్నాంగి
S R1 G1 M1 P
D1 N2 S’
38
 • జలార్నవమ్
S R1 G1 M2 P
D1 N2 S’
3
 • గానమూర్తి
S R1 G1 M1 P
D1 N3 S’
39
 • ఝాలవరాళి
S R1 G1 M2 P
D1 N3 S’
4
 • వనస్పతి
S R1 G1 M1 P
D2 N2 S’
40
 • నవనీతమ్
S R1 G1 M2 P
D2 N2 S'
5
 • మానవతి
S R1G1M1P
D2N3 S'
41
 • పావని
S R1 G1 M2 P
D2 N3 S'
6
 • తానరూపి
S R1G1M1P
D3N3S'
42
 • రఘుప్రియ
S R1 G1 M2 P
D3 N3 S'
2.నేత్ర చక్రము 8.వసుచక్రము
7
 • సేనావతి
S R1 G2 M1 P
D1 N1 S'
43
 • గవాంభోది
S R1 G2 M2 P
D1 N1 S'
8
 • హనుమతోడి
S R1 G2 M1 P
D1 N2 S'
44
 • భవప్రియ
S R1 G2 M2 P
D1 N2 S'
9
 • ధేనుక
S R1 G2 M1
P D1 N3 S'
45
 • శుభపంతువరాళి
S R1 G2 M2 P
D1 N3 S'
10
 • నాటకప్రియ
S R1 G2 M1 P
D2 N2 S'
46
 • షడ్విధమార్గిణి
S R1 G2 M2 P
D2 N2 S'
11
 • కోకిలప్రియ
S R1 G2 M1 P
D2 N3 S'
47
 • సువర్ణా౦గి
S R1 G2 M2 P
D2 N3 S'
12
 • రూపవతి
S R1 G2 M1 P
D3 N3 S'
48
 • దివ్యమణి
S R1 G2 M2 P
D3 N3 S'
3.అగ్ని చక్రము 9.బ్రహ్మ చక్రము
13
 • గాయక ప్రియ
S R1 G3 M1 P
D1 N1 S'
49
 • ధవళాంబరి
S R1 G3 M2 P
D1 N1 S'
14
 • వకుళాభరణం
S R1 G3 M1 P
D1 N2 S'
50
 • నామనారాయణి
S R1 G3 M2 P
D1 N2 S'
15
 • మాయామాళవగౌళ
S R1 G3 M1 P
D1 N3 S'
51
 • కామవర్ధని
S R1 G3 M2 P
D1 N3 S'
16
 • చక్రవాకం
S R1 G3 M1 P
D2 N2 S'
52
 • రామప్రియ
S R1 G3 M2 P
D2 N2 S'
17
 • సూర్య కాంతం
S R1 G3 M1 P
D2 N3 S'
53
 • గమనశ్రమ
S R1 G3 M2 P
D2 N3 S'
18
 • హాటకాంబరి
S R1 G3 M1 P
D3 N3 S'
54
 • విశ్వంభరి
S R1 G3 M2 P
D3 N3 S'
4. వేదచక్రము 10.దిశి చక్రము
19
 • ఝంకార ధ్వని
S R2 G2 M1 P
D1 N1 S'
55
 • శ్యామలాంగి
S R2 G2 M2 P
D1 N1 S'
20
 • నటభైరవి
S R2 G2 M1 P
D1 N2 S'
56
 • షణ్ముఖ ప్రియ
S R2 G2 M2 P
D1 N2 S'
21
 • కీరవాణి
S R2 G2 M1 P
D1 N3 S'
57
 • సింహేంద్ర మధ్యమం
S R2 G2 M2 P
D1 N3 S'
22
 • ఖరహర ప్రియ
S R2 G2 M1 P
D2 N2 S'
58
 • హేమవతి
S R2 G2 M2 P
D2 N2 S'
23
 • గౌరీ మనోహరి
S R2 G2 M1 P
D2 N3 S'
59
 • ధర్మవతి
S R2 G2 M2 P
D2 N3 S'
24
 • వరుణ ప్రియ
S R2 G2 M1 P
D3 N3 S'
60
 • నీతిమతి
S R2 G2 M2 P
D3 N3 S'
5. బాణ చక్రము 11.రుద్ర చక్రము
25
 • మార రంజని
S R2 G3 M1 P
D1 N1 S'
61
 • కాంతామణి
S R2 G3 M2 P
D1 N1 S'
26
 • చారుకేశి
S R2 G3 M1 P
D1 N2 S'
62
 • రిషభ ప్రియ
S R2 G3 M2 P
D1 N2 S'
27
 • సరసాంగి
S R2 G3 M1 P
D1 N3 S'
63
 • లతాంగి
S R2 G3 M2 P
D1 N3 S'
28
 • హరి కాంభోజి
S R2 G3 M1 P
D2 N2 S'
64
 • వాచస్పతి
S R2 G3 M2 P
D2 N2 S'
29
 • ధీర శంకరాభరణము
S R2 G3 M1 P
D2 N3 S'
65
 • మేచకళ్యాణి
S R2 G3 M2 P
D2 N3 S'
30
 • నాగానందిని
S R2 G3 M1 P
D3 N3 S'
66
 • చిత్రాంబరి
S R2 G3 M2 P
D3 N3 S'
6.ఋతు చక్రము 12.ఆదిత్య చక్రము
31
 • యాగప్రియ
S R3 G3 M1 P
D1 N1 S'
67
 • సుచరిత్ర
S R3 G3 M2 P
D1 N1 S'
32
 • రాగ వర్ధని
S R3 G3 M1 P
D1 N2 S'
68
 • జ్యోతి స్వరూపిణి
S R3 G3 M2 P
D1 N2 S'
33
 • గాంగేయ భూషణి
S R3 G3 M1 P
D1 N3 S'
69
 • ధాతు వర్ధని
S R3 G3 M2 P
D1 N3 S'
34
 • వాగధీస్వరి
S R3 G3 M1 P
D2 N2 S'
70
 • నాసికాభూషణి
S R3 G3 M2 P
D2 N2 S'
35
 • శూలిని
S R3 G3 M1 P
D2 N3 S'
71
 • కోసలమ్
S R3 G3 M2 P
D2 N3 S'
36
 • చలనాట
S R3 G3 M1 P
D3 N3 S'
72
 • రసిక ప్రియ
S R3 G3 M2 P
D3 N3 S'


స్వర స్థానముల వివరణ
షడ్జమము  
రి రి 1 శుద్ధ రిషభము  
  రి 2 చతుశృతి రిషభము  
  రి ౩ షట్ శృతిరిషభము (గ 2)
గ 1 శుద్ధ గాంధారము (రి 2)
  గ 2 సాధారణ గాంధారము  
  గ ౩ అంతర గాంధారము  
మ 1 శుద్ధ మధ్యమము  
  మ 2 ప్రతి మధ్యమము  
పంచమము  
ద 1 శుద్ధ దైవతము  
  ద 2 చతుశృతి దైవతము  
  ద ౩ షట్ శృతిదైవతము (ని 2 )
ని ని 1 శుద్ధ నిషాదము ( ద 2 )
  ని 2 కైసికి నిషాదము  
  ని ౩ కాకలి నిషాదము  Book a Show : +91 98484 98344