స్వర వారసత్వం

భారతీయ సంగీతం:

వేదకాలంలో భారతీయ సంగీతం శాస్త్ర మనోహరంగా విరాజమానమైంది.” సంగీత దర్పణం”, “సంగీత రత్నాకరం” వంటి ప్రామాణిక గ్రంధాలను అందించింది భారతదేశం. స్వర శృతి లయల సమాహారంగా భాసిల్లింది మన సంగీతం. ప్రపంచానికి ఆదర్శప్రాయమైన హృదయానుభూతిని కలిగించే రస మనోజ్ఞ మైన సంగీత విధానాన్నిరూపొందించింది. పరమేశ్వరుని పవిత్ర ఢమరుకంలోంచి నాదం పుట్టి ప్రకృతిలో చేరింది, అదే సంగీతం. చరిత్ర పయనంలో మార్గ, దేశి సంగీతాలు శాస్త్రీయ, వ్యవహారిక సంగీతాలుగా ప్రభవించాయి. పవిత్ర భారతీయ సంగీతానికి భూమిక భక్తి, వినోదం, చైతన్య ప్రభు, నామదేవ్, జ్ఞానదేవ్, తుకారాం, మీరాబాయి, భక్త జయదేవ్ లు భక్తిరససంగీతంతో భారత దేశాన్ని ఉర్రూతలూపారు.

కర్ణాటక సంగీతం:

అగ్రేసర దక్షిణాది వాగ్గేయకారులు త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, అన్నమయ్య, పురందర దాసు, క్షేత్రయ్య, సదాశివ బ్రహ్మేంద్ర యోగితదితరులు కర్ణాటక సంప్రదాయ సంగీతాన్ని అమోఘంగా ఆలపించి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించి నాదోపాసనతో మోక్షాన్ని సైతం పొందవచ్చని నిరూపించి భారతీయ సంగీతాన్ని తేజోమయం చేశారు.

పాశ్చాత్య సంగీతం

ప్రపంచంలో ప్రాచుర్యంలో వున్న పాశ్చాత్య సంగీతం లో కూడా స్వరాలు 12 మాత్రమే.కొంచెం విపులంగా పరిశీలిస్తే 16 గా గోచరిస్తాయి . కాబట్టి మన72 మేళ కర్తరగాల పరిధి దాటిన స్వరాలు,స్వర సంగమాలు ప్రపంచ సంగీతంలో మరెక్కడా గోచరించవు.

హిందుస్థానీ సంగీత౦ – కర్ణాటక సంగీతం - ప్రపంచ సంగీతం

హిందు స్థానీ సంగీతానికి మూల రూపాలైన 10 “తాట్స్” కూడా ఈ 72 మేళ కర్త రాగాలలో భాగంగానే భాసిల్లుతున్నాయి. హిందుస్తానీ సంగీతంలో స్వరాలు 12 మాత్రమే.అంటే రి ,గ,మ ,ద ,ని స్వరాలు ఒక్కొక్కటి 2 మాత్రమే వుంటాయి .కాని కర్ణాటక సంగీతంలో స్వరాలు 16.అంటే ‘రి’ లు ౩. ‘గ ‘ లు ౩ ,’మ’ లు 2,’ద ‘ లు ౩ ,’ని ‘ లు ౩ వుంటాయి. వెరసి వివరణను బట్టి చూస్తే 72 మేళ కర్తరాగాలలో భారతీయ సంగీత రూపాలన్నీ,మరియు ప్రపంచ సంగీత రూపాలన్నీ నిక్షిప్తం చేయబడి ప్రపంచం మొత్తానికే సంగీత దర్పణం గా విరాజిల్లుతున్నాయి అన్న నగ్న సత్యాన్ని తెలుసుకోవడమే అదృష్టంగా భావించాలి.

 



Book a Show : +91 98484 98344



NEWS UPDATES