ప్రయోజనాలు

స్వరనిధి ప్రాజెక్టు ప్రయోజనాలు:

  • సంగీత సాధకులను అపురూప రాగ జ్ఞానులుగా మార్చే శక్తి స్వరనిధి సొంత౦ .. 6 1/2 నిమిషాల ఈ కీర్తనను సాధన చేస్తే ప్రపంచ సంగీత మూలాలు తెలిసిపోవడమేకాక ఏ దేశపు సంగీతాన్నైనా అలవోకగా పాడే సౌలభ్యం లభిస్తుంది. సంగీత విద్యార్దులు సరళీ స్వరాలు ముందు ప్రార్ధనగా ఈ కీర్తన సాధన చేస్తే సరస్వతీ కృపతో పాటుగా 72 రాగాలపై పట్టు వస్తుంది. అందుకే భారతీయ సంగీత సిలబస్ గా పాఠ్యాంశంగా “స్వర నిధిని “ నిర్దేశించాలని పండితులు ప్రత్యేకంగా ప్రతిపాదించారు.
  • స్వరనిది సాధన వలన మనోమాలిన్యాలు ప్రక్షాళనమై ఏకాగ్రత, నిశ్చల మనస్తత్వం లభించి ఎంత గొప్ప కార్యాన్నైనా అవలీలగా నిర్వహించే నైపుణ్యం సిద్ధిస్తుంది. పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
  • అరుదైన 72 మేళ కర్త రాగాల ఆలాపనంతో ప్రాచీన, ఆధునిక సంగీత స్వర కల్పనా మర్మాలు తెలుస్తాయి.
  • స్వరనిది అధ్యయనం వలన గురువులకు బోధనం సులభతరం అవుతుంది.
  • స్వరనిది వలన కలిగే జ్ఞానం చలన చిత్రాల సంగీత కల్పనాలి నూతన ఒరవడికి అవలీలగా దారులు వేస్తుంది
  • సామాజికంగా ఉత్తమ సంస్కారు లను స్వరనిధి రూపొందిస్తుంది
  • భారతీయ విద్యా విధానంలో సంగీతాన్ని పాఠ్యాంశoగా ప్రవేశ పెట్టే విధి విధానాలకు , రూపకల్పన చేయబడుతుంది
  • భారతదేశంలోని మరియు ఇతర దేశాలలోని అన్ని ప్రముఖ సంగీత కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలలో స్వరనిధి అపూర్వ ప్రయోగాన్ని సశాస్త్రీయంగా వినిపిస్తూ, వివరిస్తూ, విద్యార్ధినీ, విద్యార్ధులకు, తెలియజేస్తూ . అధ్యాపకులకు సవినయంగా అందజేస్తానంటున్నారు స్వర వీణాపాణి.
  • 72 మేళ కర్తరాగాలతో సంగీత ప్రపంచంలో నూతన స్వర ఆవిష్కరణలు మరింత మెరుగైన విధంగా జరిగేలా చూడటం స్వరనిధి ఆకాంక్ష.
  • ప్రపంచంలో ‘సంగీత భారత్’ స్థానంపై గౌరవం పెంచబడుతుందిBook a Show : +91 98484 98344NEWS UPDATES