సంగీత దిగ్గజాల శుభాశీస్సులు:

విశ్వ సంగీత మహాయజ్ఞంలో ఒకటిన్నర దశాభ్ది తపస్సు చేసి ఫలితంగా 72 మేళకర్త రాగాల స్వరనిధిని అందుకుని ప్రపంచ ముఖద్వారానికి చేర్చిన స్వరవీణాపాణిపై సంగీత ప్రపంచ మహా దిగ్గజాల శుభాశీస్సుల వర్షం కురిసింది. 72 మేళకర్త రాగాల ఆలాపనం, వాద్య వాదనం విన్న విద్వాంసులు స్వర వీణాపాణి ని శభాష్! అని వెన్నుతట్టారు . సంగీత పండితోత్తములు ఈ స్వరనిధి ప్రాజెక్ట్ లో తాము కూడా భాగాస్వాములుగా ఉంటామని తమ ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ప్రకటించడం ఆనందదాయకం. సుమనస్కుల హృదయావిష్కరణం వారి మాటల్లోనే..

పద్మవిభూషణ్ డా|| మంగళంపల్లి బాలమురళీకృష్ణ

భారతీయ సంగీతం - ప్రత్యేకించి కర్ణాటక సంగీతం - 72 మేళకర్త రాగాలతో సుసంపన్నమై ఉంది. ప్రపంచ సంగీతంలోని ఇతర రూపాలన్నీ కూడా వీటిలోని ఏదో ఒక రాగం నుంచి పుట్టి ఉండాలి. అంటే ఈ మేళకర్త రాగాలు ప్రపంచ సంగీతానికి తండ్రి వంటివి. సరస్వతి దేవి దయతో వీణాపాణి ఆ మేళకర్త రాగాలని జీర్ణించుకుని ఉన్నాడు. అందరికి ఇవి ఒక తేలికైన మార్గంలో తెలియాలన్న ఒక ఉదాత్తమైన ఉద్దేశ్యంతో ఓ కొత్తదారిని ఏర్పరచాడు. 72 మేళకర్త రాగాలను 6.30 ని.పాటగా సంక్షిప్తీకరించాడు, సార్ధక నామధేయుడయ్యాడు. ఈ ప్రక్రియ గిన్నీస్ పుస్తకంలో స్థానం దక్కించుకుంటుంది.

పద్మ భూషణ్ డా|| కె.జె.యేసుదాస్

వీణాపాణి 72 మేళకర్త రాగాలను 6.30 ని.కాలంలో ప్రదర్శించారు. ఆయన సాధించింది ఎంతో గొప్ప కార్యం. నేటి బాలలకు ఈ 72 రాగాల పేర్లు మరియు వాటి స్థాయిలు గుర్తుపెట్టుకోవడానికి ఇది ఎంతో సులువైన పద్ధతి. చిన్నారులకు దీనిని అందించడంలో వీణాపాణి వియజం సాధించాలని సరస్వతి అమ్మవారిని ప్రార్ధిస్తున్నాను.

పద్మభూషణ్ డా|| యల్.సుబ్రహ్మణ్యం

ఇది ఎంతో ఘనకార్యం. భవిష్యత్తరాలవారికి ఎంతో ప్రేరణ కల్గిస్తుంది. 3 ని.ల కల్పన నుంచి రాగాల పేర్లు తెలుసుకోవచ్చు. అలాగే 6.30. ని. కల్పన నుంచి రాగాలను తెలుసుకోవచ్చు. ఇది ఎంతో మేధస్సుతో కూడుకుని ఉన్నది. భావితరాల వారికి దారి చూపేది మరియు వెలుగునిచ్చేది. ఇలాంటి సృజనాత్మక కల్పనలను కొనసాగించండి.

కలైమామణి పి.బి.శ్రీనివాస్

సంగీత సాహిత్య ప్రపంచానికి భగవంతుడిచ్చిన వరం స్వరవీణాపాణి. అతని ధారణ...జ్ఞాపకశక్తి...అనూహ్యం. వారిప్పటికే అసాధ్యమైనదానిని సాధించారు. పద్మ అవార్డులు వస్తాయి. గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతారు... ఇంకా ఎంతో సాధిస్తారు.

గ్రామీ అవార్డు విజేత, పద్మశ్రీ విశ్వమోహన్ భట్

సరస్వతి దేవి కృపతో స్వరవీణాపాణి గారు సాధించిన ఈ ప్రపంచస్థాయి సృష్టిలో 12 స్వరాల యొక్క వివిధ రకాల కలయికల్లో ఒక్క స్వరమూ విస్మరించబడలేదు. జాజ్..రాక్...పాప్...జానపదం మరి ఏ ఇతర స్వరరూపమైనా ఈ మేళకర్తలే వాటికి పునాది. భవిష్యత్తరాల వరికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. గ్రామీ...పద్మశ్రీ.. మరి ఏ ఇతర అవార్డులయినా కాని ఈ ప్రాజెక్టు కన్నా చిన్నవే.

ప్రఖ్యాత గాయని శ్రీమతి రావు బాల సరస్వతి

స్వరవీణాపాణి గారి ఈ సృష్టి విన్న తరవాత మతిపోయింది. అర్ధం చేసుకోవడానికే ఎంతో జ్ఞానం ఉండాలి. ముందు తరాలవారికి ఇది ఉపయోగపడాలన్న వారి కోరిక ఎంతో బాగుంది. భగవంతుడు ఆయనతో ఉండి అందరికి మంచి జరిగేలా చేయాలి.

పద్మభూషణ్ శ్రీమతి పి. సుశీల

ఇది ఎవరి వల్లా సాధ్యం కాదు. మానవుడికి అతీతమయిన శక్తి ఏదో అతనిచేత చేయించింది. ఇది అతడి అర్ధ్రగానం. దేవుడి దగ్గర 72 మేళకర్తల స్థానం సాధించాడు. ఇతడిని కన్న తల్లిదండ్రులు పుణ్యాత్ములు. అలాగే పద్మ అవార్డులు..గిన్నీస్ రికార్డులు...అవే వస్తాయి.

కలైమామణి శ్రీమతి యస్. జానకి

72 మేళకర్త రాగాలని ఇలా 6 నిముషాల 5 సెకన్ల కాలంలో కుదించాలన్న ఆలోచన రావడమే గొప్ప. దాన్ని పూర్తి చేయడం మరో గొప్ప విషయం. ఆయన ఇంకా ఎంతో సాధిస్తారని ఆశిస్తున్నాను.

కలైమామణి శ్రీమతి వాణీ జయరాం

ఇది మామూలు విషయం కాదు. భగవంతుడే చేసినట్టుంది. మామూలు గయకులు కలలోనైనా పాడలేరు. స్వరవీణాపాణి గారిలో నారదుడు ప్రవేశించి ఈ పని చేశాడనిపిస్తోంది. ఆయన ఇంకా ఇంకా ఎదగలని ఆశిస్తున్నాను.

పద్మశ్రీ శ్రీమతి చిత్ర

72 మేళకర్త రాగాలని ఇలా 6 ని. ల 5 సెకన్ల కాలంలో సంక్షిప్తంగా ప్రదర్శించటం నాకు ఎంతగానో నచ్చింది. ఇది చాలా కష్టసాధ్యమైన పని. వీణాపాణి గారు ఇలాంటివి మరెన్నో సాధించాలనుకుంటున్నాను.

పద్మశ్రీ శ్రీమతి కవితా కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం

ఒక్కో వాక్యంలో ఒక్కోరాగము. ప్రతిది సుస్పష్టం. అన్ని సమగ్రంగా...పకడ్బందీగా వెరసి ఇలాంటిది ఇదొక్కటే! ఇది విద్యార్ధులకు ఎంతో అవసరం కనుక అన్ని పాఠశాలల్లోను దీనిని ప్రవేశ పెట్టాలి. తెలుగులో దీనిని నేను పాడబోతున్నాను. దీనిని హిందీలోనూ చేయాలి. తన యుక్తిని శక్తిని సర్వస్వం ధారపోసి తనే స్వరపరచి తనే రచించి జీవిత కాలపు సృష్టిని సాధించిన స్వరవీణాపాణి గారికి అన్నింటా జయం కలగాలని ఆశిస్తున్నాను.

ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసురాలు కలైమామణి,పద్మశ్రీ కన్యాకుమారి

ఈ అపురూప సృష్టిలో 72 మేళకర్త రాగాలు సంపూర్ణంగా ఉన్నాయి. ఈ పని ఎవ్వరూ చేయలేరు. స్వరస్థానాలెంతవరకు ఉండాలో అంతవరకే కుదించబడ్డాయి. అది చాలా సంక్లిష్టమయిన పని. ప్రపంచ సంగీతానికి ఇదెంతో ఉపయుక్తం. ఇది పాట రూపంలో ఉండడం వలన ప్రతీ విద్యార్ధి దీనిని తేలిగ్గా కంఠస్థం చేయగలరు.

ప్రముఖ వీణా విద్వాంసురాలు శ్రీమతి జయంతి కుమరేష్

ఇదొక అద్భుత సృష్టి. మొదట ఇది అసలు ఎలా సాధ్యపడిందా అన్న అయోమయంలో ఉండిపోయా...తర్వాత ఇంత ఉన్నత ప్రమాణాలతో ఎలా రూపుదిద్దుకున్నదా అని ఆశ్చర్యమేసింది. సంగీతం నేర్చుకునే వారందరికీ ఇది పాఠ్యాంశంగా పెట్టాలి. మేళకర్త రాగాలు నేర్చుకోవడానికి ఇదొక ఆహ్లాదకరమైన పద్ధతి. సమకాలీన సంగీత ప్రపంచానికిదో అమూల్య కానుక.

జాతీయ అవార్డు గ్రహీత ప్రఖ్యాత గాయకులు.సంగీత దర్శకులు శంకర్ మహదేవన్

ఒక్కొక్కరిని చూడగానే మనం దిగ్భ్రమకు గురవుతాము. వీరిని చూడగానే నాకలాగే అనిపించింది. ప్రతి రాగము యొక్క సారము. ఆత్మ...ఈ కల్పనలో ఉన్నాము. ప్రతి రాగాన్ని ఇందులో స్పష్టంగా గుర్తించవచ్చు. అదెంతో పెద్ద విజయం. ఇది ప్రతి భారతీయుడిని...కాదు..ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ చేరాలనీ ఆ పరమేశ్వరుడిని ప్రార్ధిస్తున్నాను. ప్రపంచ భాషలన్నిటిలోకి తర్జుమా చేయబడటం ద్వారా అది సాధ్యపడుతుంది. అలా భారతీయ సంగీతపు సత్తా సర్వజనులకీ తెలుస్తుంది. కేవలం వినటం కంటే పాడటానికీ ఎంతో సంతోషిస్తాను, వీణాపాణి గారు అవకాశం ఇస్తే..

ప్రఖ్యాత గాయకులు పద్మశ్రీ హరిహరన్

స్వరవీణాపాణి గారు 6 ని.ల ఐదుసెకన్లలో చేసిన ఈ సృష్టి ఓ మహాద్భుతం...మానవాతీతం. ఇది అర్ధం కావడమే కష్టం. అవకాశమిస్తే పాడే ప్రయత్నం చేస్తాను. ఈ సృష్టికి వీరికి భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇవ్వాలి.

ప్రఖ్యాత గాయకులు కలైమామణి ఉన్నికృష్ణన్

6.30ని.ల ఈ అద్భుతం సంగీత కర్తలకే సంగీత కర్త అయిన స్వరవీణాపాణి గారి సృష్టి. ఇది సంగీత సరస్వతికి స్వరాభిషేకం. దీనిని భారతీయ గాయకులంతా గొంతు కలిపి పాడితే ఇది మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుంది. అవకాశం ఇస్తే నేను పాడే ప్రయత్నం చేయగలను. ప్రపంచంలోని ఏ సంగీతాన్నైనా చూడండి. అది ఇందులో ఉంటుంది.

పద్మశ్రీ మాండోలిన్ శ్రీనివాస్

వీణాపాణి గారు స్వహస్తాలతో చేసిన ఈ స్వర కల్పన అద్భుతం... అనూహ్యం కూడా. భగవత్సంకల్పం లేకుండా ఇది సాధ్యపడేది కాదు. నిజానికి మానవ మాత్రులెవరూ ఇది చేయలేరు. అన్నీ కుదిరితే నేనీ యజ్ఞంలో పాలుపంచుకుందామనుకుంటున్నాను. డాక్టరేట్..పద్మశ్రీ వంటి ఎన్నో బిరుదులు వారిని వరిస్తాయి. అనుసరిస్తాయి. అవంత పెద్దవేమీ కాదు.

ప్రముఖ ఘట విద్వాంసులు గ్రామీ అవార్డు విజేత, పద్మభూషణ్ విక్కు వినాయక్ రామ్

గతంలో విఖ్యాత గాయకమణులు యం.యస్. సుబ్బులక్ష్మి. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ మరియు వైణిక శ్రేష్టులు బాలచందర్ గార్లు 72 మేళకర్త రాగాలను ప్రదర్శిస్తుండగా సహకరించాను. నాకు గ్రామీ అవార్డు వచ్చింది. ఈ సంగీత ప్రపంచపు సంక్షిప్త రూపానికి గ్రామీతో పాటు మరిన్ని అవార్డులు దక్కాలని అశిస్తున్నాను.

ప్రముఖ సంతూర్ విద్వాంసులు పద్మశ్రీ పండిట్ భజన్ సపోరి

ఇది ఎంతో సంక్లిష్టమైన సృష్టి. రాగశాస్త్రం ప్రకారం దీనికి ఎంతో న్యాయం జరిగింది. వీణాపాణికి అత్యుత్తమ పద్మ అవార్డును ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తున్నాను.

ప్రొ|| డానియల్, ఫ్రాన్స్

స్వరవీణాపాణి అనే శక్తి సృష్టించిన ఈ సంగీతం. ఈ సాహిత్యం విన్నాను. ఎంతో సంతోషం వేసింది. దీనిని వివిధ భాషలలోకి.. వేరు వేరు సంగీత వ్యవస్థలలోనికి తీసుకువెళ్ళాలి. మా ఫ్రెంచ్ భాషలోకి తర్జుమా చేసే ప్రయత్నం తప్పక చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.

ప్రముఖ శాక్సోఫోన్ విద్వాంసులు హెన్రిక్ క్రుప్, జర్మనీ

స్వరవీణాపాణి గారి 72 మేళకర్త రాగాలలోని ‘ఋతుచక్ర’ ను సాధన చేస్తున్నాను. ప్రస్తుతం...త్వరలో విని ఆనందిద్దురు గాని..

పద్మవిభూషణ్ డా|| అక్కినేని నాగేశ్వర రావు

స్వరవీణాపాణి కి శుభాభినందనలు. డా..మంగళంపల్లి గారు...ఇంకా ఎందరో ఉద్దండులు చెప్పారు దీని గురించి...వీణాపాణి ఇంకా ఎంతో సాధించాలనుకుంటున్నారు. ఇది అందరికి అందించాలని ప్రయత్నిస్తున్నారు . ఆ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను...పెద్దవాడిని కనుక ఆశీర్వదిస్తున్నాను.

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా||సి. నారాయణ

వీణపాణిలో స్వరము - పదముల మేళవింపు ఉంది. ఈ 72 మేళకర్తల దీర్ఘగీత మాలికకు, అగ్రేసర గాయక మౌళి డా|| బాలమురళి అభినందనలే చాలు. మీకు నా ఆశీరభినందనలు. జయహో వీణాపాణి. స్వరవీణాపాణి..పద వీణాపాణీ.

కళా తపస్వి పద్మశ్రీ డా.కె . . విశ్వనాథ్

స్వరవీణాపాణీ - గొప్ప వైబ్రేషన్ ఉన్న పేరు. అలాంటివారు చేసినది ఇది. సంగీతం క్షుణ్ణంగా తెలిసిన వారెందరో దానిగురించి చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై ఇది ప్రదర్శింపబడాలని కోరుకుంటున్నాను.

పద్మశ్రీ డా|| బాపు

స్వరవీణాపాణి గారికి ఈ సందర్భంగా నా శుభాశీస్సులందజేస్తున్నాను.

ప్రఖ్యాత చిత్ర దర్శకులు సింగీతం శ్రీనివాసరావు

ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత. ప్రతి ఒక్కరికీ, ప్రత్యేకించి సంగీత విద్యార్ధినీ విద్యార్ధులకు ఓ క్యాప్సూల్ గా ఇవ్వడం గొప్ప ప్రయోజనం తో కూడుకున్నది. వారంతా మీకు ఎంతో ఋణపడి ఉన్నారు. సంగీత ప్రపంచం చేసుకున్న అదృష్టం. ఈ కల్పన.

పద్మశ్రీ డా|| కమల్ హాసన్

స్వరవీణాపాణి అనే పేరు సరిగ్గా పెట్టారు. ఇదెంతగానో ప్రశంసార్హమైనది. ఇందులో సేవాతత్పరత ఉన్నది. ఓ పాకెట్ బుక్ లా ఇది విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకుగాను ఆయన్ని అభినందించే లక్షలాది మందిలో నేనూ ఒకడిని.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు

స్వరవీణాపాణి గారి ఈ 6.30 ని.ల సృష్టి, ఆ పరదేవత ప్రచోదనే.. అందువలననే 72 మేళకర్త రాగాలలో గుంభనంగా ఉన్న రహస్యాలు వెలికి వచ్చి మూల నిధిగా స్వరనిధినిగా ఏర్పడ్దాయి. దీనికి విస్తృతమైన ప్రచారం కల్పించబడాలి. తద్వారా వ్యక్తిగతంగాను ప్రాపంచికంగాను శాంతి సాధ్యపడుతుంది. ఏ తల్లి మీలో ఉండి దీన్ని పలికించిందో ఆ తల్లే దీనిని ఖ్యాతిలోకి తెస్తుంది. భవిష్యత్తరాల వారికి సంప్రదాయకమైన సనాతనమైన సంగీతం దూరం కాకూడదనే స్వరవీణాపాణి గారి తపన తీరుతుంది. ఇంతటి వారిని చూడగలగడం వారిమాట వినగలగడం నిజంగా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను.

శివశ్రీ తనికెళ్ళ భరణి

సినీ సంగీత దర్శకుడిగా రమణమూర్తికి...వీణాపాణి అనే పేరు నేనే పెట్టాను. ఇప్పుడు 72 మేళకర్త రాగాలను ఓ దండగా గుచ్చి అమ్మవారి మెడలో వేశారు. ఇదొక అద్భుత సృష్టి అని మంగళంపల్లి వంటివారు...మరెందరో అంటున్నారు. నా స్నేహితుడిని చూసి నాకు గర్వంగాఉంది

సంగీత కళానిధి, పద్మభూషణ్ డాక్టర్. టి.వి. గోపాల కృష్ణన్, ప్రముఖ గాత్ర, లయ విద్వాంసులు

ఈరోజు నాకు ఎంతో శుభదినం. త్యాగరాయ స్వామి జన్మించిన రాష్ట్రం నుంచి స్వర వీణాపాణి వచ్చి నన్ను కలిశారు. నేనూ ఆ స్వామి భక్తుడినే. సంగీతంతో 82 సంవత్సరాలనుంచీ నాకు అనుబంధం. ఓ స్వతస్సి ద్ధ మైన సృజనని ఈ రోజు విన్నాను. వీణాపాణి వినిపించిన ఆ కల్పన వేంకటమఖి యొక్క 72 మేళకర్త రాగాలపై ఆధారపడి వుంటుంది. అది విన్నందుకు ఈరోజు నాకు శుభ దినం. ఆ మేళకర్త రాగాలే భారతీయ సంగీతం మొత్తానికీ , ప్రపంచంలో ఈ నాడున్న స్థానాన్ని ఇచ్చాయి.

12 స్వరస్థానాల [టోన్స్] నామరూపాల గురించి ప్రపంచంలో ఎవరికీ పెద్దగా తెలియదు. ఎంతో సమయాన్ని శక్తిని ఈ కల్పనకు వీణాపాణి వెచ్చించారు. ఈరోజున వారు వినిపించిన ఈ కల్పనలో ప్రతి రాగమూ.....దాని సారంశము సుస్పష్టంగా ప్రదర్సితమైయాయి. ఆనందాశ్చర్యా లతో వింటుండిపోయాను. నా ఆత్మ కదిలి పోయింది. ఒక సంగీత కారుడిగా అస్తిత్వమే కదిలిపోయింది. ఎన్నడూ ఎరగని అనుభూతి ఇది. ఈప్రక్రియ రాబోయే అన్ని కాలాలూ...ఆయా సంగీతజ్ఞులు విసిరే సవాళ్ళని తట్టుకుని నిలుస్తుంది ”ఈ కల్పన -దాని విలువ” ప్రపంచంలోని సాధకులందరూ మరియు సంగీతజ్ఞులు తెలుసుకుంటే వారికే మంచిది. దీనిని సాధన చేయడం ...గానం చేయడం ....వారందరికీ అమరత్వాన్ని అందిస్తుంది. ఆ అమరత్వమే సంగీతం. ఈ చారిత్రాత్మక ప్రక్రియను విశ్వవ్యాప్తం చేయడంలో ఎందరో మహానుభావులు ... అందరూ పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాను . వీణాపాణి నా ఏకలవ్య శిష్యుడు, అతనికి నా శుభాశీస్సులు .

సంగీత కళానిధి, పద్మభూషణ్, ప్రొఫెసర్ టి .ఎన్.కృష్ణన్, ప్రముఖ కర్ణాటక సంగీత వాయిలిన్ విద్వాంసులు

స్వర వీణాపాణి... సరస్వతీదేవి ఆశీస్సులు పొందిన మీరు సామాన్యులు కారు .ఇది ఎంతటి గొప్ప ప్రక్రియ అంటే ఇప్పటికిప్పుడు ప్లే చేయడం నాకు సాధ్యం కాదు. ఎంతో సాధనచేస్తే కొంతవరకైనా చేయగల్గుతనేమో. అంతటి కష్ట సాధ్యమైన ప్రక్రియను మీరు సాధించారు. సంగీతం బోధించే వారికి నేర్చుకొనే వారికి అర్ధమైతే ఇది ఓ వరం. ఈ ప్రక్రియను సరైన రీతిలో ప్రపంచానికి అందిస్తే కొంగ్రొత్త స్వరకల్పనలు ఉద్భవిస్తాయి. మన సంగీతానికే కాక ప్రపంచ సంగీతానికీ ఇదెంతో ఉపయుక్తం. ఈ ప్రక్రియకు ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం తోడైతే ఎన్నో ఆద్భుతాలు జరుగుతాయి. ఈ ప్రక్రియలు రెండూ సంగీతానికి ఆక్స్ ఫర్డ్ డిక్షనరీవంటివి. కనుక ఇది కర్ణాటక సంగీతానికి వీణాపాణి చేసిన విలువైన సేవ.

మహా మహోపాధ్యాయ, పద్మభూషణ్ విద్వాన్ శ్రీ నూకల చిన్న సత్యనారాయణ, ప్రఖ్యాత కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసులు

స్వర వీణాపాణి తను అనుకున్నది సాధించే విధంగా ఆ పరమ శివుడు ఆశీస్సులు అందించాలని ప్రార్ధిస్తున్నాను .అతగాడు ఆదర్శ పురుషుడుగా వన్నెకెక్కాలని ఆశిస్తున్నాను .

పద్మభూషణ్, గ్రామి అవార్డు విజేత డాక్టర్ జాకీర్ హుస్సేన్, ప్రముఖ తబలా విద్వాంసులు

మీరు సంగీత ప్రపంచానికి సేవ చేద్దామనుకున్నారు. అదే చేసారు. ఇది తగిన గుర్తింపు పొందుతుందనుకుంటున్నాను.

పద్మభూషణ్, పండిట్ దేబుచౌదరి, ప్రముఖ సితార్ విద్వాంసులు, ఢిల్లీ

విన్నతరువాత ఆయన్ని అభినందించాలని అనిపించింది, 72 మేళ కర్త రాగాల లక్షణాలన్నీ సంక్షిప్త రూపంలో నామ స్వభావాలతో సహా పొందుపరచడం విద్యార్ధులకు ఎంతైనా ఉపయుక్తం .

సంగీత కళానిధి, పద్మశ్రీ ఎన్.రమణి, ప్రముఖ కర్ణాటక సంగీత వేణు నాదవిద్వాంసులు

వీణాపాణి గారి గురించి ఇలా మాట్లాడే అవకాసం వచ్చినందుకు ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. వారే కాదు, వారి నాన్నగారు కూడా గొప్ప గాయకులు. తన జేవితాన్ని వారు అంకితం చేసి ఈ అద్భుతాన్ని సృష్ష్టించారు. వెంకటేశుని ఆశీస్సులు వారికి ఉన్నాయి. ఇలాంటి కల్పన నేను ఎన్నడూ వినలేదు. తెలుగు భాష నాకు కొద్దిగా తెలుసు. తెలుగులో వారి రచన కూడా బాగుంది. ఈకల్పన అందరు విద్యార్దులకీ, సంగీతకారులకీ మరియు సంగీతజ్ఞులకీ చేర్చబడాలి. ఆయనకు ఆయురారోగ్యాలు ఉండాలి. నా ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉంటాయి .

సంగీత కళానిధి, కలైమామణి బాంబే సిస్టర్స్, ప్రముఖ కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసులు.

స్వర వీణాపాణి తాను ఒక ‘జీరో’ గా చెబుతున్నాడు. కానీ అతను కర్ణాటక సంగీతానికి ఒక ‘’ హీరో’. ఆయన సాధించింది ఎంతో అభినందనీయం. సంగీతానికి వారందించిన గొప్ప సేవ ఇది. ఇది భగవద్దత్తం. అబ్బుర పరిచే కార్యం. విద్యార్ధులు 72 మేళకర్త రాగాల పేర్లను బట్టీ పడుతుండే బదులు ఈ గీతం ఒక్కటి పాడుకుంటే చాలు .వాటి పేర్లను గుర్తుంచుకోవటం ఒక ఆట ఆడుతున్నంత తేలిక అవుతుంది. ఇదేదో అల్లాటప్పా పనికాదు. ఇది సంగీతానికే నిఘంటువు. అన్ని వివరాలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఇలాంటివి ఎన్నో కల్పనలు మీనుంచి రావాలి. ఇది వాటిలో మొదటిది అవ్వాలి. ఇది సరస్వతీదేవి మేడలో స్వర వీణాపాణి వేసిన 72 మేళకర్త రాగాల సుమమాల.

ప్రొఫెసర్ టి .ఆర్ .సుబ్రహ్మణ్యం ప్రఖ్యాత కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసులు, మ్యుజికాలజిస్ట్

మీరు సాధించినది చాలా గొప్ప విషయం. మానవ ప్రయత్నం దీనిని సాధించలేదు. ఈ విషయమై ఎటువంటి సందేహమూలేదు. కేంద్ర ప్రభుత్వం ‘ పద్మశ్రీ ‘ తో మిమ్మల్ని గౌరవించాలి.

మిలీనియం ఫెస్టివల్ అవార్డ్ గ్రహీత & కలైమామని చిత్ర వీణ రవి కిరణ్

72 రాగాల మాలను నేను ప్లే చేసాను. మళ్ళీ నేర్చుకున్నట్లు అనిపించింది. పకడ్బందిగా అల్లబడిన మాలిక ఇది. స్వరమేలనం మరియు స్వయంగా సృజించిన సాహితీ ప్రక్రియల కలయిక ఇది. అన్ని రాగాలలోను 2- 2 1/2 ఆక్టేప్స్ లో ప్రస్తారం సాగటం మధురంగా ఉంది. అందరికీ ఇది అందాలన్న ఆయన తపన తీరాలని, అది శాస్త్రీయ ప్రపంచానికే కాక సినీ మరియు ఇతర జనబాహుళ్యానికీ చేరాలని కోరుకుంటున్నా

గ్రామీ అవార్డ్ నామిని & కలైమామణి ఫ్లూట్ - శశాంక్

చిన్నప్పుడెపుడో నేర్చుకున్న 72 మేళకర్త రాగాలు.. ఎన్నో మర్చిపోయాను కూడా. ఇప్పుడు వాయిస్తూ గుర్తు తెచ్చుకున్నాను. అందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. పెద్ద పరీక్ష ఎదుర్కొన్నట్లయింది. ఈ దార్శినిక సృష్టి కర్త ఇదంతా ఎలా ఊహించాడో ఊహాతీతం. ఓ పిల్లవాడికున్న తపన ఉంది వీణాపాణి గారికి. దీనిని ఫ్యూజన్ పద్దతిలో వినాలని ఉంది. 72 మేళకర్త రాగాలను ఇంత సంక్షిప్తీకరించడం, సృష్టిలోని సంగీత విద్యార్థులందరికీ ఎంతో ఉపయుక్తం. సంగీతమనేది మహా సాగరం. దానిని ఈదటానికి వీణాపాణిగారి ఈ ప్రయత్నం సహాయపడుతుంది. అందులో సందేహం లేదు.

కలైమామని ఎంబార్ కణ్ణన్

వీణాపాణి సృజించిన ఈ మహోత్కృష్ట కార్యం పుట్టినందుకు గర్వంగా ఉంది. ఇది శాస్త్రీయ సంగీతానికే ఉపకరించే ప్రక్రియ. శాస్త్రీయ సంగీతానముక వంటి 72 మేళకర్త రాగాలను 6 ని|| లలో సంక్షిప్తీకరించిన ప్రక్రియ. అలాగే వెంకటశ్వరుడిని కీర్తిస్తూ సాగిన రచన దివ్యంగా ఉంది. రెండు భాగాల్లోనూ - 6 ని|| ల ప్రక్రియలో రాగాలను ప్రస్తావిస్తే, 3 ని|| ప్రక్రియలో వాటి పేర్లు పొందుపరచబడ్డాయి. ఈ ప్రక్రియ అంతా అసాధారణమైన వ్యవహారం. భవిష్యత్తరాలవాళ్ళు దీన్ని సాధనచేస్తే ప్రదర్శనకు అవసరమైన జ్ఞానం వంట పడుతుంది. అదెంతో అవసరం కూడా.

కేరళ ప్రభుత్వ ఉత్తమ సంప్రదాయ గాయక అవార్డు విజేత శరత్

ఇది ఒక అరుదైన కల్పన. 72 మేళకర్తరాగాలను 6 ని||లలో కంపోజ్ చెయ్యచ్చు అని ఊహించడమే చాలా కష్టం. భవిష్యత్తరాలవారికి సంగీత ప్రియులకి ఇది ఎంతో ఉపయుక్తం. శాస్త్రీయ సంగీతానికి పునాది అయిన 72 మేళకర్తరాగాలను ఇది వినటం ద్వారా ప్రతి రాగాన్ని అవలీలగా గుర్తించగలుగుతారు. సరస్వతీ కటాక్షం కోసం ప్రార్తిస్తాను.

హైదరాబాద్ బ్రదర్స్, విద్వాన్ శ్రీ రాఘవాచారి, ప్రఖ్యాత కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసులు

స్వర వీణాపాణి రచించి స్వరపరచిన 72 మేళకర్తరాగాల కీర్తన నేను విన్నాను. ఈ కీర్తన వింటున్నప్పుడు 72 మేళకర్తరాగదేవతలు నా కళ్ళ ముందు సాక్షాత్కరించారు. ప్రఖ్యాతిచెందిన మద్రాస్ మ్యూజిక్ అకాడమీ లో వీణాపాణితో కలిసి గాయకుడుగా పాల్గొనడం, అందరి ప్రశంసలను పొందడం నాకు మరచిపోలేని గొప్ప అనుభూతి.

హైదరాబాద్ బ్రదర్స్, విద్వాన్ శ్రీ శేషాచారి, ప్రఖ్యాత కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసులు

ఈ 72 మేళకర్త రాగాల కీర్తనలో సంగీతం మరియు సాహిత్యం రెండూ అద్భుతం. మద్రాస్ మ్యూజిక్ అకాడెమీలో స్వరవీణాపాణితో కలిసి గాయకుడిగా నేను పాల్గొనడం మధురస్మృతి. ఈ కీర్తన సంగీతలోకంలో ముందు తరాల వారికి ఎంతో ఉపయోగపడుతుంది.

ప్రిన్స్ రామవర్మ, ప్రఖ్యాత కర్నాటక సంగీత వీణ మరియు గాత్ర విద్వాంసులు, త్రివేండ్రం.

స్వర వీణాపాణి స్వర పరచిన 72మేళకర్తరాగాల 2 పాటలను వినడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ పాటలు సంగీతం నేర్చుకొనే విద్యార్ధులకు, సంగీత ప్రేమికులకు 72 మేళకర్త రాగాల పేర్లతో పాటుగా 12 స్వర స్థానాలను తెలుపుతాయి.

ప్రఖ్యాత కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసులు ప్రియా సిస్టర్స్

వీరి ఆరున్నర నిమిషాల వేంకటేశ్వర స్థుతిలో సాహిత్యాన్ని అనుభవించాలా....రాగజ్ఞానాన్ని అనుభవించాలా...అన్న క్లిష్టపరిస్థితి ఎదురైంది. ఈ రెండు కల్పనలూ భారతీయ సంగీత చరిత్రలోనే విప్లవాత్మకమైనవి. ప్రతివారూ వీటిని వినాలి, నేర్చుకొని తరించాలి. స్వర వీణాపాణి గారి సాహిత్యం వింటుంటే కాళిదాసు సాహిత్యం వింటున్నట్లుగా ఉన్నది.

ప్రఖ్యాత సినీ నేపధ్య గాయని శ్రీమతి ఎస్.పి .శైలజ

ఇప్పుడే ఒక కొత్త సంగీతాన్ని విన్నాను. తల్లి సరస్వతీదేవి ప్రేరణతో గంధర్వులెవరో ఈయనలో ఇంతటి విద్యుత్తుని ప్రవేశపెట్టారు. నావంటి కొద్దిపాటే సంగీత జ్ఞానం ఉన్నవారు దీనికోసం రాక్షస సాధన చెయ్యాలి. ఆయనైతే చేతులతోనే అవలీలగా పాడి చూపించారు. ఆయనెంత సాధన చేసి ఉండాలి... ఆయనకు సరస్వతీదేవి అనుగ్రహం ఉంది. ఇది సంగీత ప్రపంచానికి చెందాల్సిన వరం. భారతీయ సంగీతానికి ఏకొద్దిగానైనా చెడు తలపెట్టిన వారిపై ఇది పాశుపతాస్త్రము. ఇది మన సంగీతానికి అమృతాన్ని అందిస్తుంది. వారు అనుకున్నది జరగాలని గురుమందల రూపిణిని ప్రార్ధిస్తున్నాను.

ప్రఖ్యాత కర్ణాటక మరియు పాశ్చాత్య సంగీత వయోలిన్ విద్వాంసురాలు శ్రీమతి జ్యోత్స్న శ్రీకాంత్,లండన్

ఈ సుదీర్ఘ కల్పన ఒక అపురూపం. మొదటిసారి విన్నప్పుడు అదిరిపోయాను. ఆయన ఆకాంక్షలు నెరవేరాలని ఆశిస్తున్నాను. శుభాభినందనలు.

డాక్టర్ ప్రతీక్ చౌదరి, ప్రముఖ సితార్ విద్వాంసులు, ఢిల్లీ యూనివర్సిటీ, ఢిల్లీ .

ఈ ప్రక్రియ సంగీతం తేలికగా అలవడేటట్లు చేస్తుంది. 72 మేళ కర్తరాగాలు గుర్తుంచుకోవటం అసాధ్యం. వాటిని అన్నిటిని ఆరున్నర నిమిషాల్లో సంక్షిప్తీకరించడం వలన భవిష్యత్తరాల సంగీత విద్యార్ధులందరికి ఎంతో ఉపయుక్తం అవుతుంది. వారు ఏప్రాంతం వారైనా, ఇలా చెయ్యాలని ఆలోచన రావటమే అపూర్వం. దీనిని వాస్తవ రూపంలోకి తేవటం ఎంతైనా అభినందనీయం. .

ప్రఖ్యాత గాయని శ్రీమతి వింజమూరి అనసూయాదేవి, అమెరికా.

స్వర వీణాపాణీ...సార్ధక నామధేయా! 72 మేళ కర్తరాగాల్ని గుప్పిట్లో ఇముడ్చుకొని జీవస్వరాలతో కూడుకున్న అమృతాన్ని అందించావు. నిన్నేమనాలి...నీకెన్నో అవార్డులు రావాలి, వస్తాయి. భారతదేశ అత్యున్నత పురస్కారం కూడా పొందుతావు. నన్ను నీ నూతన సంగీత ప్రక్రియతో మరొక లోకానికి తీసుకెళ్ళావు. లక్షల ఆశీస్సులు నీకు.

శ్రీమతి వీణా గాయత్రి, ప్రఖ్యాత వీణ విద్వాంసురాలు, వైస్ ఛాన్సలర్, తమిళనాడు మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, చెన్నై

శ్రీ స్వరవీణాపాణిగారు సాధికారికంగా 72 మేళకర్తరాగాలను ఎంతో అద్భుతంగా స్వరపరిచారు. ఈ స్వరకల్పన సంగీత విద్యార్ధులందరికీ, సంగీతాభిమానులందరికి ఎంతగానో ఉపయోగ పడుతుంది మరియు సత్ఫలితాలనిస్తుంది. నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, ప్రఖ్యాత పత్రికా విశ్లేషకుడు

వీణాపాణి నాకు సంగీత దర్శకుడు గానే తెలుసు. 72 మేళకర్తరాగాలను ఆరున్నర నిముషాలలో.. అదీ అమ్మపై రాసిన గీతంలో-గానం చేయగల సంగీత వేత్తఅని ఇప్పుడు తెలుసుకున్నాను. ప్రపంచంలో ఇది ఒక అపూర్వ ప్రయోగం. ఏదైనా వినూత్న విషయాన్ని కనుగొన్నవారికి నోబెల్ బహుమతి ఇవ్వడం కద్దు. సర్ సి వి రామన్, మేరీ క్యూరి, హరగోవింద్ ఖురానా తదితరులు ఆ కోవలోనివారే.

శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రముఖ పత్రికా సంపాదకులు

శ్రీ స్వర వీణాపాణి గారికి 72 మేళకర్తరాగాలతో వినూత్న ప్రక్రియ సృష్టించినందుకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వస్తాయి. కాని ఈ అవార్డులకన్న ప్రపంచ ప్రఖ్యాతి వహించిన ఇంతమంది మహానుభావుల ఆశీస్సులు లభించడమే ఎంతో గొప్పవిషయం. వారికి నా ఆశీస్సులు.

ప్రొఫెసర్ పప్పు వేణు గోపాల రావు, సాహితీవేత్త , మ్యూజికాలజిస్ట్ మరియు మద్రాసు మ్యూజిక్ అకాడమీ కార్యదర్శి

ఇటువంటి లెక్చర్ డెమోనిష్ట్రీషన్స్ కు వేరే ప్రసంగాలు అవసరం లేదు. వీణాపాణి గారు చేసిన ప్రయోగమే దాని గొప్పతనం గురించి అదే చాటుకుంటుంది. 72 మేళ కర్తరాగాలలో ప్రతి అంశము, రాగ ఛాయను సాహిత్యంలో భావం చెడకుండా సంగీతంతోపాటు సంస్కృతంలో స్వర కామాక్షి సాహిత్యాన్ని కూడా అందించి అద్భుతంగా ప్రదర్శించారు. హాట్స్ ఆఫ్ టు వీణాపాణి. .

శ్రీ వి.ఏ .కె రంగారావు , కళా విశ్లేషకులు, విమర్శకులు

ఇది ఒక గొప్ప ప్రయోగం ...ఒకటి కర్ణాటక సంగీతానికి సంబంధించి, రెండు సముద్రమంత శాస్త్రాన్ని అందరికి తేలికగా అందుబాటులోకి తేవటం

జోస్ మాన్యువల్, ప్రముఖ పాశ్చాత్య వయోలిన్ విద్వాంసులు, పారిస్

నాకు ఇది నచ్చింది. చాలా ఆసక్తికరంగా ఉంది.మీ దగ్గరనుంచి ఎంతో సంగీతం నేర్చుకోవాలని ఉంది.మీతో కలిసి ఇందులో పాల్గొనాలని ఉంది.

ఆంటోని రెడాన్, ఒపేరా గాయకులు, ఎగ్జిగ్యూటివ్ నిర్మాత, నిమ్రాణా మ్యూజిక్,ఢిల్లీ

మిమ్మల్ని కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఇది ఎంతో ఆశక్తి కరంగా ఉన్నది.

ఫ్రాం కోస్ లసెరి, సంగీత దర్శకురాలు,ఒపేరా కండక్టర్ ,ఫ్రాన్స్

ఇది శాస్త్రీయ సంగీతానికి ప్రజాదరణ పొందిన సంగీతానికి మధ్యలో ఉంది. అందుకే వినడానికి ఆసక్తిదాయకంగా ఉంది......వాహ్... వాహ్ ,

మార్త, ప్రఖ్యాత సెల్లో ప్లేయర్.

నేను ఇది విన్నాను. ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇదో వినూత్నమైన కల్పన. అద్భుతంగా ఉంది. వీణాపాణికి శుభాభినందనలు.

BLESSINGS - VIDEOS
T.N. KRISHNAN Blessings to Swara Veenapani(T.N. కృష్ణన్ గారి ఆశీస్సులు)

T. V. GOPALA KRISHNAN Blessings to Swara Veenapani(T.V. గోపాల కృష్ణన్ గారి ఆశీస్సులు)

PADMASHREE N. RAMANI( EMINENT CARNATIC FLUTIST)పద్మశ్రీ N. రమణి (ప్రఖ్యాత ఫ్లూట్ ఆర్టిస్ట్)

T. R. SUBRAMANIAM'S Blessings to Swara Veenapani(T.R. సుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు)

D.RAGHAVACHARY (Hyderabad Brothers)D. రాఘవాచారి, హైదరాబాద్ బ్రదర్స్

HYD BRO D. SESHACHARY Blessings to Swara Veenapani(శేషాచారి గారి ఆశీస్సులు)

R. VEDAVALLI Blessings to Swara Veenapani(R. వేదవల్లి గారి ఆశీస్సులు)
Smt R. Vedavalli

BOMBAY SISTERS Blessings to Swara Veenapani(బాంబే సిస్టర్స్ ఆశీస్సులు)
Bombay Sisters

PRIYA SISTER with Swara Veenapani (ప్రియా సిస్టర్స్ తో స్వర వీణాపాణి)

Eminent Film Playback Singer Smt SP Sailaja


CHITRA VEENA RAVI KIRAN'S Blessings to Swara Veenapani(చిత్ర వీణ రవికిరణ్ గారి ఆశీస్సులు)

EMBAR KANNAN Blessings to Swara Veenapani(ఎంబార్ కణ్ణన్ గారి ఆశీస్సులు)
Sri Embar Kannan

ANTONIE REDON Talking to Swara Veenapani
Book a Show : +91 98484 98344