స్వరవీణాపాణి పరిచయం

గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో జన్మించిన స్వరవీణాపాణి శ్రీమతి సీతా అన్నపూర్ణమ్మ, శ్రీ వోగేటి లక్ష్మీ నరసింహ శాస్త్రి దంపతులకు జన్మించి ప్రాధమిక విద్యాభ్యాసం రావెల గ్రామంలో పూర్తి చేసుకుని,గుంటూరు హిందూ కాలేజిలో డిగ్రీ పూర్తిచేసి,ఏలూరు సి ఆర్ రెడ్డి కాలేజిలో లా డిగ్రీ పొందారు.

అక్షరాభ్యాసం, స్వరాభ్యాసం రెండూ నాన్నగారి సన్నిధిలోనే నేర్చుకుని, తండ్రే తొలి గురువుగా సంగీత మెళకువలు అభ్యసించారు వీణాపాణి. హార్మోనియం వాయించడం కూడా వీరి వద్దే నేర్చుకున్నారు.

గుంటూరులో న్యాయవాది వృత్తిలో ఉండగా రమణ మూర్తిని (పూర్వ నామం )సంగీత దర్శకులుగా రచయితగా తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది దైవాంశ సంభూతులు శ్రీ శ్రీ శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్. తెనాలిలో ధ్వని ముద్రణ కాబడిన ఆ ఆల్బం”విశ్వ గీత మాల” రమణ మూర్తి స్వరప్రయాణానికి తొలి మజిలీ.

తర్వాత మద్రాసులో తన మిత్రుడైన అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి నిర్మాతగా ‘చెన్నకేశవ భక్తిమాల’ అనే ఆల్బమ్ కు సంగీత సాహిత్య సమన్వితంగా ధ్వనిముద్రితం చేసి అందించారు. ప్రముఖ గాయని పి.సుశీల గారి ఆల్బంలో రచన మరియు స్వర రచన చేసిశ్రీమతి పి.సుశీల గారి చేతుల మీదుగా తొలి పారితోషకం అందుకోవడం అతని జీవితంలో ఓ మధుర ఘట్టం .

రచయిత దర్శకులు తనికెళ్ళ భరణి ప్రోత్స్తాహంతో దర్శకులు శివ నాగేశ్వరరావు ‘పట్టు కోండి చూద్దాం’ చిత్రానికి సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. ఈచిత్రంతోటే తనికెళ్ళ భరణి రమణ మూర్తికి వీణాపాణి అనే పేరు పెట్టారు.

తర్వాత నిర్మాత దర్శకులు జనార్ధన మహర్షి ‘దేవస్థానం’ చిత్రానికి సంగీతసాహిత్యాలు అందించే అవకాశం కల్పించారు. వీణాపాణి పేరును స్వర వీణాపాణి గా మార్చారు.

ఆతరువాత తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వెలువడ్డ ‘మిధునం’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం వీణాపాణికి ఎంతో గుర్తింపు నిచ్చింది.

ఆల్ రౌండర్, టైంపాస్ వంటి మరికొన్న చిత్రాలకు కూడా సంగీత౦ అందించారు .

100 కు పైగా ఆడియో ఆల్బంలకు స్వరాలందించారు..

తనికెళ్ళ భరణి రచించి మరియు గానం చేసిన ” నాలోన శివుడు గలడు” , ”ఆటగదరా శివా” లను స్వర పర్చడం వీణాపాణికి ఎంతో ఆత్మ తృప్తిని కలిగించింది. బహుశా ఈ భక్తీ గీతాల స్వర కల్పనేస్వరనిది పుట్టుకకు కారణ మేమో !
Book a Show : +91 98484 98344NEWS UPDATES