స్వరనిధి


ప్రపంచంలోసంగీతానికి సంబంధించి శాశ్వతమైన మహానిధి ఈ 72 మేళ కర్త రాగాల ” స్వరనిధి”.సంగీత సాహిత్యాల వారధి..భవిష్యత్తరాల పెన్నిధి..సంస్కృతీ సంప్రదాయాల నిక్షిప్తనిధి ఈ” స్వరనిధి”. ఎంత ఎక్కువ సంగీత జ్ఞానాన్ని పొందితే అంత గొప్ప స్వర సంపన్నుడవుతాడు అన్నది స్వరనిది ఒరవడి.

స్వరనిధి ద్వారా సంగీత సాధన అత్యంత సులభం!.సంగీతం ప్రారంభించబోయే ముందు ప్రార్ధనాగీతంగా ఈ ఆరున్నర నిమిషాల కీర్తనను ఆలపిస్తే కొన్ని రోజులకు మనకు తెలియకుండానే అమ్మవారి దయవలన 72 మేళ కర్తరాగాలు సులభంగా నోటికి అవలీలగా వచ్చేస్తాయి. ఆ తరువాత వివరంగా ఒక్కొక్క రాగాన్ని పరిశీలించి తెలుసుకొనవచ్చును .ఇలా 72 మేళ కర్త రాగాలను కరతలామలకం చేసినవారు భవిష్యత్తులో సంగీతంలో ఎన్నో విశిష్ట స్వర కల్పనలను చేయడానికి ప్రేరణ పొందుతారు .తద్వారా సంగీత ప్రపంచ౦లో కొంగ్రొత్త పాటలు, స్వరకల్పనలు విరివిగా పుట్టుకొస్తాయి.సంగీత రసజ్ఞులు మధురానుభూతిని పొందుతారు.

స్వర వీణాపాణి 16 సంవత్సరాల అకుంఠిత దీక్షాఫలమే స్వరనిది. కేవలం ఈ ప్రక్రియలో తాను నిమిత్తమాత్రుడిగా,అంతా ఆ సరస్వతీ మాత అనుగ్రహంగా వీణాపాణి వినమ్రంగా చెప్పుకుంటారు. నూతన ప్రమాణాల సంగీతపు స్వరనిధి ప్రాజెక్టును అంతర్జాతీయంగా ముందుకు తీసుకుపోగల ప్రయత్నశీలిగా, ప్రయోగశీలిగా స్వర వీణాపాణి నిరంతరం కృషి చేస్తున్నారు

“ సులభంగా సంగీతం ...అందరికీ అందిద్దాం “...ఇదే స్వరనిధి లక్ష్యం! ----

స్వరనిధి ఆశయాలు :

  • భారతీయ ప్రపంచ సంగీత సంస్కృతికి నూతన ప్రమాణాలను నిర్దేశించడం
  • ఉన్నత సంగీత విద్యను అందించడం ద్వారా గంధర్వ గాయకులకు జన్మనివ్వడం
  • ప్రపంచ ప్రసిద్ధమైన 72 మంది గాయనీ గాయకులతో, 72 మంది వాద్యకళా ప్రతిభామూర్తులతో, 72 మేళకర్త రాగాల స్వరనిధిని అత్యంత ఆధునిక సశాస్త్రీయ రూపక ధ్వని ముద్రణం (Recording) చేసి సి.డి.లు రూపొందించడం
  • 72 మేళకర్త రాగాల కార్యక్రమాలని వివిధ మాధ్యమాలలో విస్తృత ప్రచారం చేయడం ద్వారా భారతీయ సంగీత వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం.
  • నిరుపేద విద్యార్ధినీ, విద్యార్ధులకు ఉచిత సంగీత శిక్షణ.
  • ఈ లక్ష్యాలను చేరుకోవడానికి సంగీత మహా విశ్వవిద్యాలయ స్థాపనం చేయడం.
  • సాధ్యమైనంత ఎక్కువ మందికి సంగీత శిక్షణనిచ్చి వేదికా గానయోగ్యత కల్పించడం.
  • సంగీతానికి ప్రాధాన్యతనిస్తూ , సాహిత్య, సాంస్కృతిక అంతర్జాతీయ పర్యటనలను ప్రోత్సహించడం.
  • ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమాలకు సహకరించడం.
  • అంతర్జాతీయ సాంస్కృతిక సంస్థలతో సత్సంబంధాలు పెంచుకుంటూ ప్రపంచ సంగీత కార్యక్రమాలు నిర్వహించడం.
  • భావితరాల సాంస్కృతిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్వరనిధి నేతృత్వంలో ఒక మహా గ్రంధాలయం స్థాపించడం.
  • సాంకేతికతను ఉపయోగించుకుంటూ స్వరనిధి ప్రచారాల నిమిత్తం ఒక ముద్రణాలయం స్థాపించడం.
  • అపురూపమైన , స్వర శ్రవణాలయం స్థాపించడం.
  • స్వరనిధి రూపొందించే 72 మేళకర్త రాగాల సి.డి లను అంతర్జాతీయ గ్రంథాలయాలకు, విద్యాలయాలకు మరియు సంగీత సంస్థలకు ఉచితంగా అందించడం.
  • అంతర్జాతీయ సంగీత పరిశోధనలను ప్రోత్సహించడం
  • వికలాంగులకు స్వరనిధిని బోధించడం ద్వారా వారికి జీవన భ్రుతిని కల్పించడం
  • సంగీత, సాహిత్యాల ద్వారా మానసిక శాంతి, సంస్కారవంతమైన జీవన విధానం ప్రోత్సహించడం, మానవీయ విలువలు పెంపొందించేందుకు

  • మాతృగీతం

  • 72 మేళ కర్త రాగాలతో స్వర పర్చబడ్డ మరో కల్పన మాతృగీతం.నేలతల్లి,కన్నతల్లి మరియు బాస తల్లులపై స్వర వీణాపాణి రచించిన “మాతృగీతాన్ని” ప్రపంచ భాషలన్నింటిలోకి తర్జుమా చేసి అందించడం. తద్వారా దేశభక్తి, మాతృభక్తి, మరియు మాతృభాషపై గౌరవాన్ని నేటి యువతలో పెంపొందించేలా చేయడం .

  • సంగీత చికిత్స ద్వారా వ్యాధులను నయంచేయడం.

  • దేశ విదేశాలలో స్వరనిది కార్య క్రమాలను ,నిర్వర్తించడానికి సంగీతంపై మక్కువ శ్రద్ధ ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేయడం .తద్వారా స్వరనిధి లక్ష్యాలను ప్రపంచమంతా వ్యాప్తి చేయడం
  • సంగీత సాధకులను అపురూప రాగ జ్ఞానులుగా మార్చే శక్తి స్వరనిధి సొంత౦ .. 6 1/2 నిమిషాల ఈ కీర్తనను సాధన చేస్తే ప్రపంచ సంగీత మూలాలు తెలిసిపోవదమేకాక ఏ దేశపు సంగీతాన్నైనా అలవోకగా పాడే సౌలభ్యం లభిస్తుంది. సంగీత విద్యార్దులు సరళీ స్వరాలు ముందు ప్రార్ధనగా ఈ కీర్తన సాధన చేస్తే సరస్వతీ కృపతో పాటుగా 72 రాగాలపై పట్టు వస్తుంది. అందుకే భారతీయ సంగీత సిలబస్ గా పాఠ్యాంశంగా “స్వర నిధిని “ నిర్దేశించాలని పండితులు ప్రత్యేకంగా ప్రతిపాదించారు.
  • స్వరనిది సాధన వలన మనోమాలిన్యాలు ప్రక్షాళనమై ఏకాగ్రత, నిశ్చల మనస్తత్వం లభించి ఎంత గొప్ప కార్యాన్నైనా అవలీలగా నిర్వహించే నైపుణ్యం సిద్ధిస్తుంది. పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
  • స్వరనిది సాధన వలన మనోమాలిన్యాలు ప్రక్షాళనమై ఏకాగ్రత, నిశ్చల మనస్తత్వం లభించి ఎంత గొప్ప కార్యాన్నైనా అవలీలగా నిర్వహించే నైపుణ్యం సిద్ధిస్తుంది. పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
  • అరుదైన 72మేళ కర్త రాగాల ఆలాపనంతో ప్రాచీన, ఆధునిక సంగీత స్వర కల్పనా మర్మాలు తెలుస్తాయి.
  • స్వరనిది అధ్యయనం వలన గురువులకు బోధనం సులభతరం అవుతుంది.
  • • స్వరనిది వలన కలిగే జ్ఞానం చలన చిత్రాల సంగీత కల్పనాలి నూతన ఒరవడికి అవలీలగా దారులు వేస్తుంది
  • • సామాజికంగా ఉత్తమ సంస్కారు లను స్వరనిధి రూపొందిస్తుంది
  • భారతీయ విద్యా విధానంలో సంగీతాన్ని పాఠ్యాంశoగా ప్రవేశ పెట్టే విధి విధానాలకు , రూపకల్పన చేయబడుతుంది
  • భారతదేశంలోని మరియు ఇతర దేశాలలోని అన్ని ప్రముఖ సంగీత కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలలో స్వరనిధి అపూర్వ ప్రయోగాన్ని సశాస్త్రీయంగా వినిపిస్తూ, వివరిస్తూ, విద్యార్ధినీ, విద్యార్ధులకు, తెలియజేస్తూ . అధ్యాపకులకు సవినయంగా అందజేస్తానంటున్నారు స్వర వీణాపాణి.
  • 72 మేళ కర్తరాగాలతో సంగీత ప్రపంచంలో నూతన స్వర ఆవిష్కరణలు మరింత మెరుగైన విధంగా జరిగేలా చూడటం స్వరనిధి ఆకాంక్ష.
  • ప్రపంచంలో ‘సంగీత భారత్’ గౌరవం పెంచబడుతుంది

 

స్వరార్చన విధానం

72 మేళ కర్త రాగాల శ్రీ మహా సరస్వతి బీజాక్షర పూజావిధానం

సంగీతం ద్వారా దైవాశీస్సులు పొందే మహత్తర పవిత్ర సాధనా ప్రక్రియ స్వరార్చన. 72 రాగాలు, 72 మంత్రాలతో అనుసంధానం చేస్తే విశ్వచైతన్య శక్తి అయిన శ్రీ మహా సరస్వతీ అమ్మవారి బీజాక్షర శక్తిని సాధకునికి అందించే అపూర్వ పూజావిధానం ఇది. అంటే ప్రతిరోజూ పూజా సమయంలో భక్తితో, నిష్టతో, నిలకడగా ఈ 72 రాగ మంత్రాలను పాడుకుంటే, అమ్మవారి అద్భుత శక్తి ప్రచోదనమై భక్తులకు అనన్య సామాన్యమైన ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయి. కేవలం సంగీతం మానసిక ఆనందానికే పరిమితం కాకుండా ,భక్తీ సంగీతం భగవంతుడిని చేరువకావడానికి సులభమైన మార్గాన్ని ఏర్పరుస్తుంది.అదే త్యాగయ్య అన్నమయ్య,తుకారాం,మీరాబాయ్ వంటివారలెందరో చూపిన ముక్తి మార్గం.


Book a Show : +91 98484 98344




NEWS UPDATES











72 మేళకర్త రాగాలను నేర్చుకునే రహస్యం:

సంగీత ప్రపంచంలో సంచలనలు సృష్టించే స్వరనిధి 72 మేళకర్త రాగాలను అభ్యసించాలంటే మనకున్న సంగీత పరిజ్ఞానాన్ని మరచిపోయి భక్తితో 6 1/2 నిమిషాల కీర్తనను ఆలపించాలి. ఆలపించే క్రమంలో రాగాల విషయం ఆలోచించకుండా కేవలం ఒక కీర్తనగా అభ్యసించాలి. అప్పుడు అమ్మవారి కృపతో మొత్తం 72 రాగాలు అవగతమవుతాయి. కీర్తనను కీర్తనగా అభ్యసించాలే తప్ప రాగాల విషయం ఆలోచిస్తే ఇది నేర్చుకోవడం చాలా కష్టం.