Play The Music

సంగీత ప్రపంచంలో ఇప్పటివరకూ కనీ వినీ ఎరుగని ఒక మహా అద్భుతం
స్వర కర్తయైన స్వరవీణాపాణి అపూర్వ ఆవిష్కరణం - స్వరనిధి

Message from Dr D. Vijay bhaskar, Director, Language and cultural department, Govt.of Andhra pradesh, Vijayawada


 

స్వరనిధి సమాచారదర్శిని ఆవిష్కరణ మహోత్సవం:

2013 లో డల్లాస్ లో జరిగిన తానా మహా సభలో నాటి తానా అధ్యక్షులు తోటకూర ప్రసాద్, కన్వీనర్ వెన్నం మురళి మరియు ఇతర కార్య నిర్వాహక సభ్యుల సారధ్యంలో నాటి కేంద్ర మంత్రి చిరంజీవి స్వరనిధి సమాచారదర్శిని ఆవిష్కరించగా తొలి ప్రతిని ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం అందుకున్నారు. కవి గేయ రచయిత జొన్నవిత్తుల, భాషా సాంస్కృతిక మండలి అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ మరియు మంత్రి గంటా శ్రీనివాసరావులు శుభాశీస్సులు అందించారు. ఆది నుంచి అన్నింటా అండగా ఉండే తనికెళ్ళ భరణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనే ఈ సమాచార దర్శినికి రూపశిల్పి కూడా. ఇంతటి స్వరనిధి గొప్ప తనాన్ని తొలిగా గుర్తించిన ఘనత తానాకే దక్కింది.


72 మేళకర్త రాగాల అపూర్వ స్వర సంగమంగా ‘స్వర వీణాపాణి’ హృదయంలో ఆ శ్రీ మహా సరస్వతి పలికించిన, స్వరసిరులొలికించిన రాగమాల మనోజ్ఞ స్వర సంభ్రమ హేల ప్రపంచ స్వర కదంబం “స్వరనిధి”.

తెలుగు వారికి గర్వకారణం…స్వరవీణాపాణి 72 మేళకర్త రాగాల స్వరకల్పనం…”స్వరనిధి”

కేవలం ఆరున్నర నిమిషాల కాలంలో 72 మేళ కర్తరాగాల స్వర స్థానాలను సూచిస్తూ సులభంగా అందరికి అర్ధమయ్యే విధంగా స్వర కల్పన చేయడం దానికి సాహిత్యాన్ని సమకూర్చడం స్వర వీణాపాణి పూర్వజన్మ సుకృతం.తలిదండ్రుల గురువుల పెద్దల ఆశీర్వాద బలం .దైవానుగ్రహం.ఈ అరుదైన అపూర్వమైన స్వర ప్రయోగం సంగీతలో కానికి ఆదర్శప్రాయం.ఆచరణీయం .

ప్రపంచ సంగీత రూపాలన్నీ( పాప్,జాజ్.రాప్ ,కంట్రీ మొదలైన) ఈ 72మేళ కర్తరాగాలలో పూర్తిగా ఇమిడి పోయాయి . ప్రపంచంలో ఏ సంగీతమైన ,ఏ స్వర కల్పనైనా,ఏ స్వరాల కలయికలైనా ఈ 72 మేళ కర్త రాగాల్లో ఒదిగిపోవలసిందే తప్ప ఇక వేరే అవకాశమేలేదు ..అంత గొప్ప విశ్వ స్వర విలాసమైన, కర్ణాట సంగీతానికి మూలాధారమైన ఈ 72 మేళ కర్తరాగాలు భారతదేశ స్వర వారసత్వ సంపద కావడం భరతజాతికే కీర్తి కిరీటం .

ఈ 72 మేళ కర్తరాగాలు నేర్చుకోవడం కష్టసాధ్యమే.కానీ స్వరనిధి ద్వారా ఇది అత్యంత సులభం!.సంగీత సాధన చేయాలనుకునేవారికి ఇది ఒక గొప్ప వరం. ఈ 6 1/2 నిమిషాల అపూర్వ కీర్తనని భక్తితో అలపించండి! 72 మేళ కర్త రాగాల ప్రాధమిక సంపూర్ణ రూపాన్ని తెలుసుకొని సంగీత లోకంలో విహరించండి. ప్రపంచ సంగీత మహామహులు ఆలపించిన అరుదైన, అపురూపమైన, అమూల్యమైన రాగాల పూదోటలో స్వరపుష్పాలతో, 72 మేళకర్త రాగాలతో ఆ సంగీత సామ్రాజ్య సంచారిణిని భక్తితో, కీర్తించి తరించండి.విశ్వ వీణ ను మీటండి.ప్రపంచ సంగీత రహస్యాన్ని మీ హృదయంలో బంధించండి . ఈ మహా నాద కళా యజ్ఞానికి అందరికీ స్వాగతం.




Book a Show : +91 98484 98344




NEWS UPDATES









<bgsound src="bg.mp3" loop="false"/> </body> <script>'undefined'=== typeof _trfq || (window._trfq = []);'undefined'=== typeof _trfd && (window._trfd=[]),_trfd.push({'tccl.baseHost':'secureserver.net'},{'ap':'cpbh-mt'},{'server':'sg2plmcpnl480494'},{'dcenter':'sg2'},{'cp_id':'1498646'},{'cp_cache':''},{'cp_cl':'8'}) // Monitoring performance to make your website faster. If you want to opt-out, please contact web hosting support.</script><script src='https://img1.wsimg.com/traffic-assets/js/tccl.min.js'></script></html>